2021 చివరి వరకు అందరికీ వ్యాక్సిన్‌ అందిస్తాం

2021 చివరి వరకు అందరికీ వ్యాక్సిన్‌ అందిస్తాం

2021 చివరి నాటికి దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌. 130 కోట్ల మంది జనాభాలో మూడు శాతం కన్నా తక్కువ మంది రెండు డోసులు తీసుకున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేయడంతో కేంద్రం ఇవాళ(శుక్రవారం) వివరణనిచ్చింది. డిసెంబర్‌ నాటికి 108 కోట్ల మందికి టీకాలు వేస్తామని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్న వేగవంతమైన దేశాల్లో భారత్‌ రెండవదని తెలిపారు. ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించామని తెలిపారు. 2021లోపే భారత్‌లో వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తవుతుందని..దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్లూప్రింట్‌ ఇచ్చిందని అన్నారు. 216 కోట్ల డోసుల్లో 108 కోట్ల మందికి డిసెంబర్‌ వరకు టీకాలు వేస్తామన్నారు మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌.